ముంబై నుంచి మాదకద్రవ్యాలు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ పరిధిలో జరిగిన దాడుల్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని రూ.1.50 లక్షల విలువైన 11 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం మియాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.