KRNL: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఇందులో 11కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.