గుంటూరు మిర్చి యార్డు నూతన ఛైర్మన్ కుర్రా అప్పారావు సోమవారం పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మిర్చి రైతుల ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవాలని, యార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా అప్పారావుకు ఎమ్మెల్యే సూచించారు.