ATP: గుత్తి డివిజన్ పరిధిలో నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏపీఎస్పీడీసీఎల్ గుత్తి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పద్మనాభ పిళ్లై తెలిపారు. గుత్తి 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతుల పనులు చేపట్టనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.