ELR: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈనెల ఒకరోజు ముందుగా డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శులతో బ్యాంకు మేనేజర్లతో సోమవారం మాట్లాడటం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి 31వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్ పంపిణీ అధికారులకు అందుబాటులో ఉండి పెన్షన్స్ తీసుకోవాలన్నారు.