GNTR: కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన యర్రు సువర్ణ ఈనెల 26న బంధువుల ఇంటికి వెళ్ళిన సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి 10 గ్రాముల బంగారం, 140 గ్రాముల వెండి వస్తువులను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.