ప్రకాశం: తాను రాజకీయాల్లో చేసిన సేవలు సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం మార్కాపురం 2వ వార్డ్‌లో జిల్లా ఏర్పాటు సందర్భంగా కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. గతంలో పనిచేసిన వారందరి కంటే తాను మెరుగ్గానే పనిచేశానని, నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే సూచించారు.