WG: పోడూరు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 4, 5 తరగతుల చిన్నారులపై అనుచిత ప్రవర్తన చేశాడని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.