PPM: కురుపాంలో బెల్లం విక్రయ దుకాణాలపై ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అనుమానం ఉన్న పలు గోదాంలలో తనిఖీలు చేశారు. నల్ల బెల్లం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నామని, అధిక మొత్తంలో ఎక్కడైనా బెల్లం క్రయ, విక్రయాలు జరిగితే సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.