ప్రకాశం: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కు పాదం మోపాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా సోమవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. వాగులు, ఇతర వనరుల్లో లభ్యమయ్యే ఇసుకను కేవలం 500 మీటర్ల పరిధిలోని గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలనీ కలెక్టర్ ఆదేశించారు.