బాపట్ల జిల్లా ఆరు నియోజకవర్గాలలోని 25 మండలాలతో ఏర్పడింది. జిల్లాల పునర్విభజనతో 25 మండలాల నుంచి 20 మండలాలకు పరిమితం కానుంది. అద్దంకి నియోజకవర్గం లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాలోని కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య 6 నుండి ఐదుకు చేరుకుంది.