గుంటూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సోమవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పోలీసు అధికారులకు సూచించారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సుల వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువతను చైతన్యం చేయాలని సూచించారు.