కృష్ణా: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అనుచరులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. సోమవారంతో రిమాండ్ ముగియడంతో, పోలీసుల ఆధ్వర్యంలో వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా SC, ST కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి వచ్చే నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కోటేశ్వరరావు (A2), రాము (A3), వజ్రకుమార్(A6), రామాంజనేయులు(A9)గా ఉన్నారు.