ADB: ఆటలు ఆడుకునేందుకు వెళ్లవద్దన్నందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దండేపల్లి మండలానికి చెందిన శ్రీదేవి-నారాయణ దంపతుల చిన్న కుమారుడు ఆకర్ష్ సోమవారం స్నేహితులతో ఆడుకునేందకు వెళ్తుంటే తల్లి అడ్డుచెప్పింది. ఆటలు మానేసి చదువుకొమ్మని చెప్పినందుకు మనస్తాపంతో ఆకర్ష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.