ELR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి, నూరుశాతం ఉత్తీర్ణత సాదించేందుకు రూపొందించిన ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ కే. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.