భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వారా తెరుచుకోగా.. సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. రాములోరి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అటు ద్వారకా తిరుమలలోనూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారదర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. గోవింద నామస్మరణతో చిన్న తిరుమల మార్మోగుతోంది.