KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయ నాన్‌టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ సలహాదారు రంగనాథ్‌కు మేనేజ్మెంట్ విభాగంలో డాక్టరేట్ లభించింది. ఆచార్య సి. విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ సిమెంట్ పరిశ్రమలో ఆర్థిక నిర్వహణపై ఆయన చేసిన పరిశోధనకు సోమవారం ఈ డిగ్రీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ వెంకట బసవరావు, రిజిస్ట్రార్ రంగనాథ్‌ను అభినందించారు.