MDK: యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులకు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లి యూరియా సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజులుగా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని సూచించారు.