W.G: తణుకు మండలం కొమరవరంలో రైతు చిట్టిబాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రం వద్ద గురువారం ‘పొలంబడి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కె.రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ‘ఇండి జీనియస్ గ్యాప్ సర్టిఫికేషన్ పొలంబడి’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తణుకు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు నరేంద్ర రైతులకు అవగాహన కల్పించారు.