NRPT: ఉట్కూర్ మండలంలోని పులిమామిడి గ్రామ ఎస్సీ కాలనీలో ఇళ్ల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్, 11 కేవీ విద్యుత్ లైన్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండటంతో పలువురు పేదలు తమ ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు.