NTR: గోవా గవర్నర్ అశోక గజపతి రాజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయ లాంజ్‌లో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం లభించింది. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, ఇతర జిల్లా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు. విమానాశ్రయం వెలుపల పోలీసు భద్రత మధ్య ఆయన కొద్దిసేపు అధికారులతో ముచ్చటించారు.