GDWL: పేద ప్రజల సొంత ఇంటి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం జమ్మిచేడులో ఫరీదా అనే లబ్ధిదారుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.