తెలంగాణ (Telangana) ఏర్పడిన అనంతరం టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు (Sania Mirza) సీఎం కేసీఆర్ అండదండలు అందించారు. టెన్నిస్ (Tennis)లో సత్తా చాటేందుకు ఆమెకు ప్రత్యేకంగా ప్రోత్సాహాకాలు తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) అందించింది. కొన్నాళ్లు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassedor)గా కూడా సానియా పని చేసింది. ప్రస్తుతం అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త సచివాలయంలో (New Secretariat) సానియా ప్రత్యక్షమైంది. దశాబ్ది ఉత్సవాల్లో సానియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హైదరాబాద్ (Hyderabad)లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ (KCR) జాతీయ జెండా ఎగురవేసి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇటీవల టెన్నీస్ కు ముగింపు పలికిన మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా హాజరైంది. వీవీఐపీలకు కేటాయించిన స్థానంలో ఆమె ఆసీనురాలైంది. ఎమ్మెల్సీ కవిత (K Kavitha) పక్కన సానియా కూర్చుని ఉంది. గులాబీ రంగు డ్రెస్ లో ప్రత్యేకంగా కనిపించింది. వీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ కనిపించారు. అనంతరం పలువురితో ప్రత్యేకంగా సానియా మాట్లాడింది. సీఎం సలహాదారు స్మితా సబర్వాల్ తో సెల్ఫీ దిగింది.
అనంతరం కొత్తగా నిర్మించిన సచివాలయం భవనం లోపలకు సానియా వెళ్లింది. భవన నిర్మాణాన్ని ప్రత్యేకంగా సానియా పరిశీలించింది. సుందరమైన నిర్మాణానికి ముగ్ధురాలైంది. సచివాలయం సందర్శించడంపై ట్విటర్ (Twitter)లో ఓ పోస్టు చేసింది. ‘తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం సంతోషానిచ్చింది. సీఎం కేసీఆర్ నిర్మించిన అద్భుతమైన కొత్త సచివాలయాన్ని కూడా సందర్శించాను’ అని ట్వీట్ (Tweet) చేసింది.
So happy to be part of the Telangana Formation Day Celebrations and to Visit the beautiful new Dr.B R Ambedkar Telangana State Secretariat led by Honorable CM KCR Garu Sir . #TelanganaTurns10pic.twitter.com/Vrtgv6nz3E