తెలంగాణ కోడలిగా చెప్పుకునే వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి తెలంగాణ వంటకాలు (Telangana Food Items) చేశారు. సకినాలు (Sakinalu) చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. సకినాలు రాకపోవడంతో పూరిలాగా పిండిని చేసి వదిలేశారు. ఆమె వంటలు చేసేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఆ వీడియో వైరల్ (Viral)గా మారింది.
తెలంగాణ అవతరణ వేడుకల (Telangana Formation Day) సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) లోటస్ పాండ్ (Lotus Pond)లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం షర్మిల (Sharmila) పార్టీ కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి వంటలను పరిశీలించారు. సకినాలు చేస్తున్న మహిళలను చూసి ఆమె చేసేందుకు ప్రయత్నించారు. కానీ రాకపోవడంతో పూరీగా పిండిని చేశారు. అనంతరం డబల్ కా మీఠాపై తుదిగా డ్రైఫ్రూట్స్ వేశారు. ఆ తర్వాత పొయ్యి(Stove) వద్ద కూర్చుని సకినాలు కాల్చడం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షర్మిల ట్వీట్ చేశారు.
‘3 కోట్ల మంది పోరాటం, అమరవీరుల త్యాగ ఫలితం మన తెలంగాణ. సాంస్కృతిక వారసత్వం, విభిన్న సంస్కృతి తెలంగాణ సొంతం. జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం వైఎస్సార్ టీపీ (YSRTP) కట్టుబడి పని చేస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు (Greetings)’ అని షర్మిల వీడియో పంచుకుని పోస్టు చేశారు.
3 కోట్ల మంది పోరాటం, అమరవీరుల త్యాగ ఫలితం "మన తెలంగాణ". సాంస్కృతిక వారసత్వం, విభిన్న సంస్కృతి తెలంగాణ సొంతం. జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం YSR తెలంగాణ పార్టీ కట్టుబడి పని చేస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ… pic.twitter.com/lxnyS2HK8D