GNTR: తెలుగు భాషా పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతిక అకాడమీ పనిచేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ శరత్ చంద్ర తెలిపారు. మంగళగిరిలో ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, త్వరలోనే ‘తెలుగు వర్చువల్ అకాడమీ’ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇంటర్మీడియట్ అకాడమీ పాఠ్యపుస్తకాలను పైరసీ చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.