»Adipurush Movie Pre Release Event On 6th June In Sv University Tirupati
Adipurush తిరుమల వెంకన్న సాక్షిగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 16వ తేదీన విడుదల చేస్తామని సినిమా బృందం చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాపై వివాదాలు మొదలవుతున్నాయి.
రామాయణ గాథను ‘ఆదిపురుష్’గా (Adipurush) ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాముడి పాత్రలో ప్రభాస్ (Prabhas), సీతగా కృతీసనన్ (Kriti Sanon) నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలవగా.. పాటలు వరుసగా వదులుతున్నారు. ఈనెల 16వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉండడంతో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఈనెల 6వ తేదీన తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటన విడుదల చేసింది.
ఈనెల 6వ తేదీన మంగళవారం తిరుపతిలోని (Tirupati) శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియంలో (SV University Stadium) వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుందని తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్, కృతీసనన్, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), ఓంబిర్లా తదితరులు తిరుపతికి తరలి రానున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 16వ తేదీన విడుదల చేస్తామని సినిమా బృందం చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాపై వివాదాలు మొదలవుతున్నాయి. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమా తీయిస్తోందని.. మతోన్మాదం పెంచి పోషించేందుకు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్త నటిస్తున్నారు. హేమమాలిని, అభిషేక్ బచ్చన్ వంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. రూ.400 కోట్లకు పైగా ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కించారని సమాచారం. ఒక్క గ్రాఫిక్స్ కే రూ.100 కోట్లు నుంచి 150 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతోపాటు హిందీ మరికొన్ని భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు.