GNTR: మంగళగిరి బస్టాండ్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ కలిసి ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారి సమస్యలను తెలుసుకుంటూ నేతలు ప్రత్యేకంగా స్పందించారు.