W.G: ఉండి బస్సు స్టాండ్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బుధవారం దివ్యాంగశక్తి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమల్లో ఉన్న మహిళలకు స్త్రీశక్తి పధకం క్రింద ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉన్నట్లే.. అలాగే దివ్యాంగులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.