KRNL: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 2025- 26 సంవత్సరానికి గాను 9 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 31, 2026 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.