AP: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలో విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురవనుందని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.