CTR: గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని వెల్కూరు పంచాయతీ పీ.బీ అగ్రహారం MPUP పాఠశాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యతపై వారిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఆహారం నాణ్యతగా ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.