TG: భద్రాచలం రేపటి నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 27న సీతారాముల కళ్యాణం, 28న మహా పట్టాభిషేకం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురానున్నారు.