ADB: గాదిగూడ మండలంలోని మారేగావ్ నుంచి భొజ్జుగూడ వరకు ఉన్న బీటీ రోడ్డు ఎన్నో ఏళ్ళ నుంచి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తోంది. దీంతో బుధవారం నార్నూర్ పర్యటనకు వచ్చిన జిల్లా పాలనాధికారి రాజర్షి షాకు కొలామా సర్పంచ్ రాథోడ్ స్వాతి జగన్నాథ్ వినతి పత్రం అందజేశారు. వీలైనంత త్వరలో దీన్ని మంజూరు చేసి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు.