రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పై థ్రిల్లర్ మూవీ ధురంధర్ 2 ప్రీమియర్ షోలపై నెలకొన్న డైలమాపై మేకర్స్ స్పందించారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయిని.. తమిళ్, తెలుగు ప్రీమియర్ షోలు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభవుతాయని ప్రకటించారు. మలయాళం, కన్నడలో రేపు ఉదయం నుంచి షోలు పడతాయన్నారు. కాగా ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించాడు.