SRPT: జిల్లా ప్రజలకు ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ గొడవలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.