TG: కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సభలో పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. కొత్త గవర్నర్ ప్రసంగానికైనా.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారనుకున్నా.. కానీ రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను వివరించామన్నారు.