అనంతపురంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం సందర్భంగా MLA దగ్గుపాటి ప్రసాద్ దివ్యాంగులకు తన కార్యాలయంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని ఎమ్మెల్యేలు దగ్గుపాటి, బండారు శ్రావణి, కలెక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు.