సత్యసాయి: జిల్లా ప్రజలకు ఎస్పీ సతీష్ కుమార్ ఉగాది, రంజాన్ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాలు సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ప్రజలు సంప్రదాయాలను పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని విజ్ఞప్తి చేశారు.