NLG: అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చిందని స్థానికులు నమ్మకం. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.