CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారమ్మ బుధవారం అమావాస్య పూజలను అందుకొని భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేకువజామునే అమ్మవారిని అర్చకులు అభిషేకించారు. తర్వాత కాటుక, కుంకుమ, వేపాకు, వివిధ పుష్పాలతో భద్రకాళి రూపంలో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.