NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ ఆకుల రవి నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎంజీయూలో కామర్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ‘లా’ కాలేజీ బాధ్యతలను కొనసాగిస్తారు.