MBNR: నారాయన పేట జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ హబ్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం దామరగిద్ద మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీవో నర్సింగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ, ఎస్టీ హబ్ ద్వారా పారిశ్రామిక రంగంలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాలపై వివరించారు.