WNP: జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన కార్యాలయంలో జిల్లాలోని 5 మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పన్ను బకాయి ఉన్న వారి జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, ఈ జాబితాను సంబంధిత వార్డు కౌన్సిలర్లకు అందజేయాలని అన్నారు.