TG: గతంలో ప్రజల జీవితకాలం 32 ఏళ్లుగా ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరిత విప్లవంతో ఆకలి తీర్చడమే కాదు.. సరిపడా ఆహార ఉత్పత్తి నెహ్రూ హయాంలో సంస్కరణల వల్ల సాధ్యమైందన్నారు. దీంతో ప్రస్తుతం ఇతర దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందన్నారు. ఇందిరా గాంధీ హయాంలో పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారన్నారు.