VZM: ఎస్.కోట మండలం వీరనారాయణం జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయురాలు అనంతలక్ష్మి మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణలో ఇటీవల గ్యాస్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాఖలోని అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా STU నేతలు డీఆర్వోను బుధవారం కలిసి బాధితురాలికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.