KRNL: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని ఏపీ రజక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ సావిత్రి కోరారు. ఎన్నికల సందర్భంగా రజకులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని విజయవాడలోని ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌ను కలిసి బుధవారం వినతిపత్రం ఇచ్చారు. దేవాలయ పాలకమండలిలో నాయీ బ్రాహ్మణుల తరహాలో సభ్యులుగా ఉండేలా రజకులకు అవకాశం కల్పించాలన్నారు.