భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడాకారులుగా ఎదగాలనుకునే వారికి చదువు కూడా ముఖ్యమేనని చెప్పారు. చదువును నిర్లక్ష్యం చేసి, కేవలం క్రీడా జీవితంపైనే దృష్టి పెడితే అది రిస్కే అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క గాయంతో పరిస్థితులు మారిపోవచ్చన్నారు. 50 నుంచి 60 ఏళ వయసులో ఆడటం సాధ్యం కాదని తెలిపారు.