»Japan Ukraine Canada Sri Lanka Australia And More Coutries Expressed Condolences On Odisha Train Accident
Train Accidentపై కెనడా, జపాన్, ఉక్రెయిన్ తదితర ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి
భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం భారతదేశంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాద వార్త విన్న వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి.
భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం (Tragedy) సంభవించింది. మృతుల (Deaths) సంఖ్య దాదాపు 300కు చేరుతుండగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం భారతదేశంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాద వార్త విన్న వారంతా ఆవేదన చెందుతున్నారు. ప్రమాద దృశ్యాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు (Countries) కూడా స్పందించాయి. కెనడా (Canada), జపాన్ (Japan), ఆస్ట్రేలియా (Australia), శ్రీలంక (Sri Lanka), ఉక్రెయిన్ (Ukrain) తదితర దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelenskyy) సంతాపం ప్రకటించారు.
‘ఉక్రెయిన్ ప్రజల తరఫున బాధిత కుటుంబాలు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ – జెలెన్ స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
‘ఒడిశా రైలు ప్రమాద వార్త నా హృదయాన్ని కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రజలకు కెనడావాసులు అండగా ఉంటారు’ – జస్టిన్ ట్రుడో (Justin Trudeau), కెనడా ప్రధానమంత్రి
‘ఒడిశా ప్రమాద మృతులు, క్షతగాత్రుల వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. బాధిత కుటుంబాలకు జపాన్ ప్రజల తర్వాత తీవ్ర సంతాపం ప్రకటిస్తున్న. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ – ఫుమియో కిషిదా (Fumio Kishida), జపాన్ ప్రధాన మంత్రి
ఇక ప్రమాద వార్తపై తైవాన్ అధ్యక్షుడు ట్సాయి ఇంగ్ వెన్, ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రులు సంతాపం ప్రకటించారు.
On behalf of myself and the people of Ukraine, I express my deepest condolences to Prime Minister @narendramodi and all relatives and friends of those killed in the train accident in the state of Odisha. We share the pain of your loss. We wish a speedy recovery for all those…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 3, 2023
The images and reports of the train crash in Odisha, India break my heart. I’m sending my deepest condolences to those who lost loved ones, and I’m keeping the injured in my thoughts. At this difficult time, Canadians are standing with the people of India.