»Justice Nv Ramana Kcr Condolence To The Death Of Ramoji Rao
Ramoji Rao: రామోజీ రావు మృతిపై జస్టిస్ ఎన్వీ రమణ, కేసీఆర్ సంతాపం
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల భారత ప్రధాన మాజీ న్యాయమూర్తి , జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సమాజానికి ఆయన చేసని కృషిని గుర్తు చేసుకున్నారు.
Justice NV Ramana, KCR condolence to the death of Ramoji Rao
Ramoji Rao: ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) మృతిపట్ల భారత ప్రధాన మాజీ న్యాయమూర్తి , జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) సంతాపం వ్యక్తం చేశారు. ఈనాడు, ఉషాకిరణ్ సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాది అవకాశాలు కల్పించారని గుర్తుచేసుకున్నారు. ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు రామోజీరావు అని కొనియాడారు. ప్రజాస్వామ్య విజయాన్ని చూసిన తరువాతే ఆయన తుది శ్వాస విడిచారు అని పేర్కొన్నారు. రామోజీ రావు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని తెలియజేశారు.
వ్యాపారదిగ్గజం రామోజీ రావు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తపరిచారు. అనేక రంగాల్లో ఆయన రాణించిన విధానం, మీడియా సంస్థలకు ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాడ సానుభూతి తెలిపారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. స్వయం కృషితో ఎదిగిన ఆయన ప్రస్తానం ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం తెలిపారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం నేడు అందరికీ ఆదర్శమని కొనియాడారు. తెలుగువాడి సత్తాను ప్రపంచానికి చాటాడు అని పేర్కొన్నారు.