Modi : రేపే మోదీ పట్టాభిషేకం.. రక్షణ వలయంలో దిల్లీ
ముచ్చటగా మూడోసారి భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ దగ్గర అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
PM Narendra Modi visit Telangana today for Lok Sabha elections
Narendra modi : అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు మూడో సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ(NARENDRA MODI) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం ఆయన ప్రధాన మంత్రిగా దిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి భవన్ వేదికగా మారింది. ఆదివారం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్లీ మొత్తం రక్షణ వలయంలో ఉంది. దిల్లీ(DELHI) పోలీసుల ఉన్నతాధికారులు రాష్ట్ర పతి భవన్‌లోనూ భద్రతా సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి పలువురు విదేశీ ప్రముఖులతో పాటు, పలు రాష్ట్రాల నుంచి నాయకులు సైతం హాజరవుతున్నారు. మొత్తం పది వేల మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. ముఖ్యుల కోసం అక్కడ మూడు హోటళ్లను సిద్ధం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ వసతి ఏర్పాట్లు ఇస్తున్నారు.
మోదీ(Modi) ప్రమాణ స్వీకారం సందర్భంగా మొత్తం దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. జూన్ 9, 10 తారీఖుల్లో ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని పోలీసులు పేర్కొన్నారు. పారా గ్లైడింగ్, డ్రోన్లు ఎగరవేయడం, గాలి బుడగలు ఎరవేయడం, రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేయడం లాంటి పనులు అన్నింటినీ నిషేధించినట్లు చెప్పారు. ఒకవేల ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారికి ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు విధిస్తామని తెలిపారు.